శాపాలను తొలగించే కోటిపల్లి క్షేత్రం

పరమశివుడు ఒక్కో క్షేత్రంలో ఒక్కో విశేషాన్ని కలిగి ఉంటాడు. తనని భక్తిశ్రద్ధలతో కొలిచేవారిని ఆయన అమ్మలా అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఆయన కొలువైన ప్రాచీన క్షేత్రాల్లో 'కోటిపల్లి' ఒకటి. రాజమండ్రి సమీపంలో అలరారుతోన్న ఈ క్షేత్రంలో సదాశివుడు 'కోటీశ్వరస్వామి'గా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఇక్కడ కోటి లింగాలు ఉండటంతో ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చింది.

గోదావరి నదీ తీరంలోని క్షేత్రం కనుక, కార్తీక మాసంలో స్వామివారిని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కార్తీక మాసంలో ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, సమస్త దోషాలు .. పాపాలు .. శాపాలు నశిస్తాయని అంటారు. దక్ష ప్రజాపతి శాపానికి గురై తన శక్తిని కోల్పోయిన చంద్రుడు, ఈ క్షేత్రాన్ని దర్శించి శాప విముక్తిని పొందాడని స్థల పురాణం చెబుతోంది. అలాగే గౌతమ మహర్షి శాపానికి లోనైన ఇంద్రుడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి, శాప విమోచనాన్ని పొందాడట. అంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని కార్తీక మాసంలో దర్శించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి.


More Bhakti News