కార్తీకంలో శివకేశవ క్షేత్ర దర్శన ఫలితం

కార్తీకమాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది కనుక, ఈ మాసంలో శివాలయాలు .. విష్ణుమూర్తి ఆలయాలు భక్తులతో సందడిగా కనిపిస్తుంటాయి. శివకేశవులు కొలువైన క్షేత్రాలను దర్శించడానికి భక్తులు మరింత ఆసక్తిని చూపుతుంటారు. నదీ తీరంలో కొలువైన శివకేశవ క్షేత్రాలను దర్శించుకోవడం వలన, విశేషమైన ఫలితాలు లభిస్తాయి కనుక, అక్కడ ఈ మాసంలో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

అలా నదీ తీరంలో అలరారుతోన్న శివకేశవ క్షేత్రాలలో 'జొన్నాడ' ఒకటి. తూర్పుగోదారి జిల్లా రావులపాలెం సమీపంలో .. గోదావరి నదీ తీరంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. అగస్త్య మహర్షి ఇక్కడ ఉమామహేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతోంది. శివాలయానికి ఎదురుగా వున్న విష్ణుమూర్తి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా జనార్ధనస్వామిని నారద మహర్షి ప్రతిష్ఠించాడు. కార్తీకమాసంలో ఇక్కడ శివకేశవులకు విశేషమైన పూజలను నిర్వహిస్తుంటారు. ఈ క్షేత్ర దర్శనం వలన మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడమే కాకుండా, మోక్షం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


More Bhakti News