కార్తీకంలో జ్వాలాతోరణ దర్శన ఫలితం

కార్తీక మాసం పుణ్యరాశి .. ఈ మాసంలో ఆచరించే పూజలు .. వ్రతాలు .. నోముల వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో శివకేశవుల ఆరాధనా ఫలితం విశేషంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మాసంలో 'పౌర్ణమి' మరింత విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. 'కార్తీక పౌర్ణమి' రోజున శివాలయాలు భక్తుల సందడితో కళకళలాడుతూ కనిపిస్తుంటాయి. భక్తులు ఉపవాస దీక్షను చేపట్టి, దేవాలయంలోని ఉసిరిక చెట్టు క్రింద దీపాలు వెలిగిస్తుంటారు. ఆ దీపాల వెలుగు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంటుంది.

ఈ రోజున శివాలయాలలో 'జ్వాలా తోరణోత్సవం' జరుపుతుంటారు. పరమశివుడు త్రిపురాసురులను సంహరించి విజయుడైన ఈ రోజున, ఆయనకి దిష్టి తగలకుండా పార్వతీదేవి 'జ్వాలాతోరణోత్సవం' నిర్వహించిందని అంటారు. ఈ 'జ్వాలా తోరణోత్సవం' దర్శించడం వలన సమస్త పాపాలు .. దోషాలు నశించి, ఆయురారోగ్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


More Bhakti News