ఈ రోజున వస్త్ర దానం చేయాలి

కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ప్రతి రోజు ఏదో ఒక విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. పూజలు .. నోములు .. వ్రతాలతో ఈ మాసమంతా సందడిగా ఉంటుంది. 'బలిపాడ్యమి' .. 'భగినీ హస్త భోజనం' .. 'నాగుల చవితి' తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి వస్తుంది. దీనినే 'బోధనా ఏకాదశి' అని అంటారు.

ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు, ఈ ఏకాదశి రోజున యోగ నిద్రనుంచి మేల్కొంటాడు. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి శ్రీమహా విష్ణువును పూజించాలి .. జాగరణతో ఆ స్వామిని కీర్తించాలి. ఇక ఈ రోజున వస్త్ర దానం చేయాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ విధంగా చేయడం వలన విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. సుఖసంతోషాలతో కూడిన జీవితం లభించడమే కాకుండా, మరణానంతరం ఉత్తమ గతులు కలుగుతాయి.


More Bhakti News