తామర మాలతో లక్ష్మీదేవి జపం!

దీపావళి రోజు రాత్రి లక్ష్మీదేవిని పూజించాలి .. అంకితభావంతో ఆరాధించాలి. ఈ విధంగా చేయడం వలన ఆ ఇంట ఆ తల్లి తన 'కళ'ను ఉంచుతుంది. సిరిసంపదలతో ఆ ఇల్లు కళకళలాడేలా చేస్తుంది. ఈ రోజున రెండు ప్రమిదలలో ఐదేసి వత్తుల చొప్పున వేసి, ఆవు నెయ్యితో దీపారాధన చేసి .. తెల్ల కలువలతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారి అష్టోత్తరం .. సహస్ర నామాలు భక్తి శ్రద్ధలతో చదవాలి.

ఈ రోజున 'ఓం మహాలక్ష్మీ దేవ్యై నమః' అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తూ 108 పూసలు గల 'తామర మాల'తో ఈ మంత్రాన్ని జపించాలి. ఈ విధంగా దీపావళి రోజున అమ్మవారి మంత్రాన్ని జపించడం వలన ఆ తల్లి ప్రీతి చెందుతుంది .. విశేషమైన పుణ్య ఫలాలను ప్రసాదిస్తుంది. అమ్మవారి అనుగ్రహం చేత దారిద్య్రం .. అందువలన కలిగే దుఃఖం తొలగిపోతాయి. సుఖశాంతులతో కూడిన జీవితం లభిస్తుంది. అందువలన దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించే అవకాశాన్ని వదులుకోకూడదు.


More Bhakti News