బలి పాడ్యమి రోజున దాన ఫలితం!

మాసాలన్నింటిలో కార్తీక మాసానికి ఎంతో ప్రత్యేకత వుంది. ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో విశేషాన్ని సంతరించుకుని ఉంటుంది. శివకేశవుల ఆరాధనకు ఈ మాసం ఎంతో విశేషమైనదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నదీ స్నానం .. ఉపవాసం .. వ్రతాచరణ .. పురాణ పఠనం విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఇక ఈ మాసంలో చేసే 'దానం' కూడా అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా 'బలి పాడ్యమి' రోజున తప్పకుండా దానం చేయాలి. కార్తీక శుద్ధ పాడ్యమికి 'బలి పాడ్యమి' అని పేరు. ఈ రోజున బలి చక్రవర్తిని పూజించాలి. అంతేకాదు తమకి చేతనైనంత దానం చేయాలి. సాధారణంగా ఎవరైనా తమ పూర్వీకులు ఇచ్చిన సంపదను పెంచుకోవాలని అనుకుంటారు. లేదంటే తరిగిపోకుండా జాగ్రత్తపడుతుంటారు. 'బలి పాడ్యమి' రోజున దానం చేయడం వలన, సంపదలు తరగవు .. వృద్ధి చెందుతూ వుంటాయి.


More Bhakti News