శివుడికి తుమ్మిపూలు, విష్ణువుకి అవిసెపూలు
మాసాలన్నింటిలో కార్తీక మాసం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శివకేశవులకి ఇది అత్యంత ప్రీతికరమైన మాసం. అందువలన ఈ మాసంలో హరిహర క్షేత్రాలన్నీ భక్తుల సందడితో కనిపిస్తుంటాయి.
కార్తీక మాసంలో నదీ స్నానం .. ఉపవాసం .. దైవారాధన .. కార్తీక దీపారాధన విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈ పవిత్రమైన మాసంలో శివకేశవులను వారికి ఇష్టమైన పూలతో పూజించాలి. పరమశివుడికి తుమ్మిపూలు ఎంతో ప్రీతికరమైనవి .. ఇక శ్రీమహా విష్ణువుకి అవిసె పూలంటే ఎంతో ఇష్టం. అందువలన ఈ మాసంలో శివకేశవులను ఈ పూలతో పూజించడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి.