ఈ రోజున నువ్వుల నూనెతో తలంటుకోవాలి

ఆశ్వయుజ బహుళ చతుర్దశి 'నరక చతుర్దశి'గా చెప్పబడుతోంది. ఈ రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి .. నీటిలో గంగ ఆవేశించి ఉంటారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన ఈ రోజున సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకుని స్నానం చేయవలసి ఉంటుంది.

స్నానానికి ముందు ఈ నీటిని తుమ్మి .. తగిరస .. ఉత్తరేణి కొమ్మలతో కలియబెట్టాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజున యముడికి నువ్వులతో మూడు మార్లు తర్పణం విడిచి .. ఆయన నామాలను చెప్పుకోవాలి. ఈ విధంగా చేయడం వలన యమ గండాలు తొలగిపోతాయి. ఈ రోజున ఇంట్లోను .. ప్రాంగణంలోను దీపాలను వెలిగించి, బాణా సంచను కాల్చుతారు.


More Bhakti News