ఆయురారోగ్యాలనిచ్చే ధన్వంతరి

జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలంటే ఆరోగ్యం ఎంతో అవసరం. ఎంతటి సిరి సంపదలున్నా వాటిని అనుభవించడానికి కావలసింది ఆరోగ్యమే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు అంటూ వుంటారు. ఆరోగ్యాంగా ఉంటే అన్నీ వున్నట్టేనని భావించాలి. అందుకే ఏ దేవాలయానికి వెళ్లినా .. ఏ దైవాన్ని దర్శించుకున్నా ఆయురారోగ్యాలను ప్రసాదించమనే అంతా భగవంతుడిని కోరుకుంటూ వుంటారు.

అలాంటి ఆయురారోగ్యాలను ప్రసాదించే దైవంగా 'ధన్వంతరి' కనిపిస్తాడు. పాల సముద్రం నుంచి అమృత కలశంతో విష్ణుమూర్తియే ధన్వంతరిగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. ధన్వంతరి వైద్య విద్యకు అధిదేవుడుగా పూజించబడుతున్నాడు. అలాంటి ధన్వంతరిని ఆయన జయంతిగా చెప్పుకునే ఆశ్వయుజ బహుళ ద్వాదశి రోజున పూజించడం వలన, వివిధ రకాల వ్యాధులు .. బాధలు దరిచేరవని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


More Bhakti News