ధర్మబద్ధమైన కోరికలు అలా నెరవేరతాయి

ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లినా .. ఏ ఆలయ దర్శనం చేసినా మనసులోని ధర్మబద్ధమైన కోరికలను దైవానికి చెప్పుకోవడం జరుగుతుంది. మనసులోని ఆ కోరిక నెరవేరితే మళ్లీ స్వామి దర్శనం చేసుకుంటామంటూ మొక్కుకుంటారు. మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలంటే, దైవానుగ్రహం కావలసిందే. ఆ స్వామి అనుగ్రహం కావాలంటే, జీవన విధానం ధర్మబద్ధమైన మార్గంలో కొనసాగాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఉదయాన్నే నిద్రలేచి పవిత్రమైన భావనతో పూజ చేసుకోవాలి. వేళగాని వేళలో నిద్రించకుండా ఉండాలి. వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇతరులకు ఏ విషయంలోను .. ఏ రకంగాను హాని చేయకూడదు. దానధర్మాలు చేస్తూ దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండాలి. ఇలా పవిత్రమైన .. ధర్మబద్ధమైన .. ఆధ్యాత్మికపరమైన మార్గంలో నడవడం వలన, మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయనేది మహానుభావులు చెప్పిన మాట.


More Bhakti News